ఈడీ అధికారుల భౌతిక దాడి: షియోమీ ఆరోప‌ణ‌

ఈడీ అధికారుల భౌతిక దాడి: షియోమీ ఆరోప‌ణ‌

న్యూ ఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని (పీఎంఎల్ఏ) ఉల్లంఘించారంటూ ఇటీవలే షియోమీ ఇండియాకు చెందిన రూ.5,551 కోట్ల నగదు నిల్వలను ఈడీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించిన షియోమీ ఇండియా.. విచారణ పేరిట ఈడీ అధికారులు తమ సంస్థకు చెందిన ప్రతినిధులపై భౌతిక దాడు లకు దిగారని ఆరోపించింది. తమ కంపెనీ మాజీ ఎండీ మనుకుమార్ జైన్, ప్రస్తుత సీఎఫ్ఓ సమీర్ బీఎస్ రావులను ఈడీ అధికారులు బెదిరించారని కూడా ఆరోపించింది. తాము చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని… అందులో భాగంగా అరెస్టులు, దాడులు, ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఉంటాయని బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బెదిరింపుల కారణంగానే ఈడీ కోరినట్లుగానే తమ ప్రతినిధులు వాంగ్మూలం ఇచ్చారని షియోమీ తెలిపింది. జప్తు చేసిన రూ.5,551 కోట్ల నగదు నిల్వలను విడుదల చేయాలని కోర్టు ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి నగదు నిల్వల జప్తును నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos