ప్రేమికుని వంచన…యువతి ఆత్మహత్య

ప్రేమికుని వంచన…యువతి ఆత్మహత్య

(రమేశ్‌ రెడ్డి)

చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది పంచాయతీ కౌశిగానిపల్లిలో ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్య౦, అశ్విని  గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అశ్వినికి ఏడు నెలల క్రితం నిశ్చితార్థం జరగాల్సి ఉండిందని ఆమె తల్లి తెలిపారు. అయితే పెళ్లి చేసుకుంటే చనిపోతానంటూ అశ్విని మొబైల్‌కు సుబ్రహ్మణ్యం సంక్షిప్త సందేశం పంపాడని చెప్పారు. దీంతో నిశ్చితార్థం ఆగిపోయిందన్నారు. ఇటీవల సుబ్రహ్మణ్యానికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, అశ్విని నిలదీయడంతో ఏమైనా చేసుకో అన్నాడని తెలిపారు. సూసైడ్ నోట్‌లో ఇదంతా రాసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos