ఎలుగుబంటి దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

హొసూరు : కృష్ణగిరి జిల్లా మహారాజకడై వద్ద బుధవారం వేకువ జామున ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కొత్తగుట్టలపల్లి గ్రామానికి చెందిన నాగమ్మ గ్రామ సమీపంలోని ఆలయానికి వెళ్ళింది. అక్కడే ముళ్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఆమెపై దాడి చేసింది. ఆమె అరుపులు విని గ్రామస్థులు అక్కడికి చేరుకుని

ఎలుగుబంటిని తరిమివేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆమెను క్రిష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్రిష్ణగిరి జిల్లాలోని అంచెట్టి, తళి, రాయకోట, డెంకణీకోట, మహారాజకడై, వేపనపల్లి సమీపాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నందున తరచూ వన్య మృగాలు గ్రామాలపై పడి పౌరులపై దాడి చేస్తున్నాయి.

తాజా సమాచారం