ప్రమాదాల్ని పసిగట్టే వోక్స్ వ్యాగన్

ప్రమాదాల్ని పసిగట్టే వోక్స్ వ్యాగన్

న్యూఢిల్లీ: : రానున్న తరం అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని వోక్స్వ్యాగన్ ముందుగానే ప్రమాదాల్ని పసిగట్టే నూతన శ్రేణి కార్లను వచ్చే ఏడాదికి విప ణిలో ప్రవేశ పెట్టనుంది. అత్యాధునిక సాంకేతిక డిజిటల్ హంగుల్ని పొందుపరిచారు. క్యాబిన్ని బటన్ లెస్గా మార్చేందుకు ప్రయత్నించారు. ఎనిమిదో తరానికి చెందిన ఈ కారు పాత తరం గోల్ఫ్ రకాల్ని తలపిస్తుంది. డబుల్ బ్యారెల్ ఎల్ఈడీ లైట్లతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మధ్యలో ఎయిర్ డ్యామ్ ఉంది. క్యాబిన్లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు 8.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ తెర, 10అంగుళాల ప్రత్యామ్నాయ ఇన్ఫోటైన్మెంట్ తెర ఉండేలా రూపొందించారు. శామ్సంగ్లోని కొన్ని స్మార్ట్ఫోన్ మోడళ్లను దీనితో అనుసంధానించ వచ్చు. తలుపు తెరవడం, ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఫోన్ని ‘కీ’గా వాడుకోవచ్చు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos