వెన్ను విరుస్తున్న వర్క్ ఫ్రమ్ హోం

వెన్ను విరుస్తున్న వర్క్ ఫ్రమ్ హోం

న్యూ ఢిల్లీ: ఇండియా హెల్త్ ఆఫ్ ది నేషన్స్ స్టేట్స్ అధ్యయనం ప్రకారం వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల్లో మదుమేహం, రక్త పోటు స్థూల కాయం లాంటి జబ్బులు పెరిగిపోతోంది. పని ఒత్తిడి,వేళకు తినకపోవడం ఇందుకు కారణాలు. అంటూ వ్యాధుల బారినా పడుతున్నారు.వీటన్నింటికంటే వెన్ను నొప్పి సమస్యగా తయారవుతోంది. నడుం నొప్పి, కీళ్ల సమస్యలు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్ల సమస్యలు. ఇప్పుడవి యువతకూ వస్తున్నాయి. భంగిమలో కూర్చోకపోవడం వల్లేవల్లే ఈ సమస్య పెరిగిపోతోంది. కచ్చే రీలో మాదిరి పని చేసుకునే ఏర్పాట్లు అమర్చుకుంటే ఈ సమస్య రాబోదని జిందాల్ నేచుర్క్యూర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ యోగా ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ రాజేశ్ చెప్పారు. ‘ వీటిని సహజమైనవిగా భావిస్తున్నారు. సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ చేయడం లేదు. కొన్ని కంపెనీలు ఆఫీస్ చెయిర్లను సమకూర్చగా, మరికొందరు వాళ్లంత వాళ్లే కొనుక్కుంటున్నారు. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ చెయిర్లు, నేల మీద కూర్చుని పీటల మీద ల్యాప్ట్యాప్లు పెట్టుకుని పని చేస్తున్నారు. మధ్య, చిన్న జీతగాళ్లు తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే పని కానిచ్చేస్తున్నారు. అడ్డదిడ్డంగా కూర్చుని-పడుకుని ఇలా రకరకాల భంగిమల్లో పని చేయడం. అదీ ఎక్కువ గంటలు ఒక క్రమపద్దతిని పాటించకుండా చేయడం వెన్ను నొప్పికి దారి తీస్తోంద’ని వివరంచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos