మైమరపించే ‘మంగంపేట’

మైమరపించే ‘మంగంపేట’

తిరుపతి:ఈ జలపాతాన్ని ఒక్క సారి చూడండి . ఎంతో హాయనిపిస్తుంది మనస్సుకు. కష్టమంతా దూది పింజెలా ఎగిరి పోతుందంటే అతిశయోక్తి లేదు. ఇది ఎక్కడో పరాయి రాష్ట్రంలోనో , విదేశంలోనో లేదు. మన పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా అవుకు మండలం మంగంపేట తాండ లో ఉంది. బనగానపల్లెకు 20 కి.మీ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతమిది. ఇటీవలి భారీ వర్షాలకు జలపాతం నయనమనోహరంగా ఉంది. బనగానపల్లె-ప్యాపిలి దారిలో యాగంటిపల్లె, దద్దనాల చెరువుకు రెండు కి.మీ తరువాత ఎడమ వైపు తిరిగి ఆరు కి.మీ నడిస్తే మంగం పేట అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి నుంచి ఐదు కి.మీ కంకర రోడ్డు మీద వెళితే జల పాతం మార్గం దర్శనమిస్తుంది. వాహనాన్ని నిలిపిన స్థలం నుంచి సుమా రు అర్థ కి.మీ దూరాన్ని నీళ్లలో నడవాలి. నీటి లోతు మోకాళ్లను మించదు.అప్పుడు గానీ జలపాతం కళ్ల ముందు సాక్షాత్కరించదు. ట్రయత్లాన్ లాగా ఇదో రకమైన ఉత్సాహం, సాహసం. జలపాతం దగ్గరి ప్రదేశం విశాలంగా ఉన్నందున ఎక్కువ మంది వెళ్లిన టి ఇబ్బంది ఉండదు .అందరూ హాయిగా జల విన్యాసాన్ని చూడవచ్చు. వర్షా కాలంలో మాత్రమే వీటికి ప్రాణం వస్తుంది. వచ్చే డిసెంబరు వరకే ఈ అందాల్నిఆస్వాదించ వచ్చు. ఆ తర్వాత మళ్లీ వానాకాలానికే. ఇది చాలా చక్కటి విహార, పర్యాటక స్థలం. ప్రకృతి అందాల మధ్యలో ఒక కొత్త లోకానికి వెళ్ళామానే మధు రానుభూతి కలుగు తుంది. నంద్యాల, బనగానపల్లె, కర్నూలు, కడప జిల్లా తదితర ప్రాంతాల ప్రకృతి ప్రియులతో ఇది ప్రస్తుతం కిటకిటలాడుతోంది. ఆలస్యం చేయకుండా మీరూ వెళ్లి ఆ అందమైన అనుభూతిని ఆస్వాదించండి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos