వార్సికీ విద్యుత్ బిల్లు ‘వాత’

వార్సికీ విద్యుత్ బిల్లు ‘వాత’

ముంబై: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి అదానీ విద్యుత్ సంస్థ రూ.1,03,564 రూపాయలు బిల్లుగా పంపడంతో బిత్తర పోయాడు. ‘అదానీ విద్యుత్ సంస్థ నాకు రూ. లక్ష బిల్లు వేసింది. ఎవరైనా నేను వేసిన పెయింటింగ్స్ కొంటే ఆ బిల్లు కడతాన’న్నారు. పెయింటింగ్స్పై వచ్చిన వార్తా కథనాల్ని ట్వీట్కు జతపరిచారు. వచ్చే నెలలో కూడా ఇలానే బిల్లు వస్తే మూత్ర పిండాలు అమ్ముకోవాల్సిందేనని చురక లంటించారు. కాసేపటికి అదానీ బిల్లును సరి చేసిందని మరో ట్వీట్ చేశారు. జూన్ నెలలో సామాన్యులకు, నటులు తాప్సీ పన్ను, రేణుకా షాహానే, హుమా ఖురేషి, నిమ్రత్ కౌర్, సోహా అలీ ఖాన్, అమైరా దస్తూర్, డినో మోరియా, కామ్యా తదితరులకు భారీగా బిల్లులు వచ్చాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos