వోడాఫోన్‌కి భారీ జరిమానా

వోడాఫోన్‌కి  భారీ జరిమానా

జైపూర్ : గుపర్తింపు పత్రాల్ని పరిశీలించకుండా నకలు సిమ్ కార్డు జారీ చేసిన నేరానికి ఐటీ శాఖ వినియోగదారు కృష్ణ లాల్ నైన్ కు రూ 27.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2017, మే 25న కృష్ణ లాల్ నైన్ లోని హనుమాన్ఘర్ వోడాఫోన్ స్టోర్కి వెళ్లి డూప్లి కేట్ సిమ్ కోసం అభ్యర్థన చేసుకున్నాడు. ఆ సిమ్ యాక్టివేట్ కాలేదు. పదే పదే ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేక పోయింది. దీంతో జైపూర్ లో వోడాఫోన్ సంస్థకు వాఫిర్యాదు చేసిన మరునాడు సిమ్ యాక్టివేట్ అయింది. ఈ లోపు భాను ప్రతాప్ అనే మరో వ్యక్తి కృష్ణ లాల్ నంబర్తోనే డూప్లికేట్ సిమ్ సంపాదించి బ్యాంకుల నుంచి రూ.68.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. తన ఐడీబీఐ బ్యాంక్ ఖాతా నుంచీ పెద్ద మొత్తంలో బదిలీ కావటంతో బాధితుడు వోడాఫోన్ ఐడియా కంపెనీపై న్యాయ పోరాటానికి దిగాడు. గుర్తింపు పత్రాల్ని తనిఖీ చేయకుండా నకలు సిమ్ కార్డు ఇచ్చినందుకు నష్ట పరిహారం కోరాడు. కృష్ణ లాల్ నైన్కి రూ.68.5 లక్షల్లో దాదాపు రూ. 44 లక్షలు భాను ప్రతాప్ తిరిగి ఇచ్చాడు. మిగిలిన 27.5 లక్షలు వోడాఫోన్ చెల్లించాలని తాజాగా ఐటీ శాఖ ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos