ప్రజా ప్రతినిధుల కేసుల్ని వర్చువల్ కోర్టుల్లో విచారించాలి

ప్రజా ప్రతినిధుల కేసుల్ని వర్చువల్  కోర్టుల్లో విచారించాలి

రాజమండ్రి: విదేశాల్లోలోగా మన దేశంలోనూ వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజా ప్రతినిధుల కేసుల్ని వర్చువల్ కోర్టుల్లో విచారించాలన్నారు. ముఖ్యమైన కేసుల్లో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విన్నవించారు. ఈ పద్ధతి విదేశాల్లో ఉందని పేర్కొన్నారు. జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేసారని చెప్పారు. కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారన్నారు. చివరకు కోర్టుల తీర్పుకు లోబడి ప్రజా సేవ చేసారని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos