భాజపాలో అత్యంత నిజాయితీ పరుడు

భాజపాలో అత్యంత నిజాయితీ పరుడు

న్యూఢిల్లీ: ప్రజలు ఎవరికి ఓటు వేశారో తాము తెలుసుకోగలమని వెల్లడించిన భాజపా నేత బక్షిత్ సింగ్ విర్క్ ఆ పార్టీలో అత్యంత నిజాయితీ పరుడని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్లో స్పందించారు. ‘భాజపాలో అత్యంత నిజాయితీపరుడు ఈయనే’అని వ్యంగ్యాస్త్రాన్ని సంధిం చారు. హర్యానాలోని అసంధ్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి బక్షిత్ సింగ్ విర్క్ మాట్లాడారు.‘ ఎవరెవరు ఓటు వేసేందు కు వెళ్లారో మాకు తెలుస్తుంది. వారు ఎవరికి ఓటేశారో తెలుసుకోవాలనుకుంటే తాము తెలుసు కోగలం. ఎందుకంటే ప్రధాని మోదీ, హర్యానా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చాలా తెలివైన వారు. ఈవీఎంలలో ఏ మీటను నొక్కినా భాజపాకే ఓటు పడుతుంద’న్నారు.

తాజా సమాచారం