రూ.10 వేలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

రూ.10 వేలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

తిరుమల : తిరుమల శ్రీనివాసుడిని కులశేఖరపడి కావలి వరకు వీవీఐపీలు దర్శించుకునే తీరులోనే సామాన్యభక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దర్శనానికి రూ.10 వేలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి ట్రస్ట్) పేరుతో ఈ పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళంగా ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ అందిస్తామని తెలిపారు. గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నవంబర్ తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్ పథకానికి సంబంధించిన యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మొదటి 15 రోజుల పాటు తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో టిక్కెట్లను అందించనున్నట్టు చెప్పారు. ఈ ట్రస్టుకు వచ్చిన విరాళాలతో ఆలయాల పరిరక్షణ, నిర్మాణాలకు వినియోగిస్తామన్నారు. విరాళాలు ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్ పరిధిలో పరిగణిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. విరాళంగా రూ.10 వేలు చెల్లించడంతో పాటు టికెట్‌ను రూ.500తో కొనుగోలు చేయాల్సివుంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఒక నెల ముందుగానే కోటాను విడుదల చేస్తామని తితిదే పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos