వెనుజులా మరో సిరియా కారాదు

వెనుజులా మరో సిరియా కారాదు

మాస్కో: లాటిన్ అమెరికా దేశమైన వెనుజులా మరో సిరియా కాకూడదని ఆశించినట్లు రష్యా శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. వెనిజులాలో నికోలస్‌ మదురో రెండో సారి ఏర్పాటయిన కొత్త ప్రభు త్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతున్న ప్రస్తుత దశలో రష్యా ఈ మేరకు స్పందించింది. పశ్చిమా సియా, ఆఫ్టని స్తాన్ తదితర దేశాల అంత ర్గత పాలనా రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోవటం తెలిసిందే. ‘అమెరికా విధానాల్ని మేము ఎంత మాత్రమూ సమర్థించం. వెనుజులా ప్రజల జీవితాలు బాగు చేస్తున్నామనే పేరిట అమెరికా అక్కడ అడుగు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది వెనుజులా చేటు చేయదనే నమ్మకం లేదు. వెనుజులా రెండో సిరియా కాకూడదు. ఆ దేశంలో అమెరికా జోక్యం చేసుకో కూడదు’’ అని రష్యా పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos