గ్రామ పంచాయతీ అధ్యక్షుని ఔదార్యం

గ్రామ పంచాయతీ అధ్యక్షుని ఔదార్యం

 

హోసూరు :  గ్రామ పంచాయతీ అధ్యక్షుడు తన సొంత నిధులతో ఓ గ్రామానికి రోడ్డును నిర్మించి ఇచ్చాడు. గత 25 ఏళ్లుగా రోడ్డు లేక ఆ గ్రామస్థులు పడిన అవస్థలు వర్ణనాతీతం. హోసూరు యూనియన్ గోపనపల్లి పంచాయతీలో గల బొమ్మసంద్ర గ్రామంలో సుమారు 30 కుటుంబాలున్నాయి. గ్రామస్థులు కూలీ పనులు చేస్తూ జీవనం చేస్తున్నారు.  సరైన రహదారి లేక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గ్రామానికి వెళ్లే దారిలో ఎక్కువ పట్టా భూములు ఉండడంతో అధికారులు, నాయకులు సైతం చేతులెత్తేశారు. చేసేదిలేక గ్రామస్థులు నడుచుకుని వెళ్లేవారు. ఏడాది కిందట గోపనపల్లి పంచాయతీకి అధ్యక్షుడిగా ఎన్నికైన గీతా శంకర్ ఎన్నికల వాగ్ధానం నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బొమ్మనపల్లి గ్రామానికి రోడ్డు నిర్మించడానికి అడ్డుగా ఉన్నభూమిని ప్రైవేట్ వ్యక్తుల వద్ద తన సొంత డబ్బు  రూ.20 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. అనంతరం రోడ్డును నిర్మించారు. హోసూరు బిడిఓ రామచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సన్మాన సభ ఏర్పాటు చేసి 25 ఏళ్లుగా రోడ్డు లేని బొమ్మసంద్రకు రోడ్డు నిర్మించి ఇచ్చిన పంచాయితీ అధ్యకుడు గీతా శంకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి పంచాయితీ ప్రముఖులు రామచంద్రన్, చంద్రశేఖర బాబు, వీరభద్రప్ప, ముగళూరు పంచాయతీ అధ్యక్షుడు మహేష్, ఎస్.ముదుగానపల్లి పంచాయతీ అధ్యక్షుడు రమేష్, సీపీఐ నాయకుడు సిద్ధరాజ్, గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos