చెన్నై:ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత విజయ్కాంత్ ఆసుపత్రిలో చేరారు. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం ఆయన చెన్నై పోరూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని.. త్వరలోనే ఇంటికి చేరుకుంటారని డీఎండీకే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, గతకొంతకాలంగా విజయ్కాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.ఈ కారణంగానే ఆయన కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయలేదు. విజయ్కాంత్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో ఆయన భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పొత్తులపై పార్టీ చర్చలు జరుపుతున్నది. ఈ సమయంలోనే విజయ్కాంత్ ఆసుపత్రిలో చేరారు.