విజయ్‌ సేతుపతికి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే..

  • In Film
  • October 20, 2019
  • 46 Views
విజయ్‌ సేతుపతికి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే..

విభిన్న కథాంశాల చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటుడు విజయ్ సేతుపతి తాజాగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజయ్…తాజాగా ‘లాభం’ అనే చిత్రంలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ సందర్భంగా ఈ సినిమాలో రైతులకు సంబంధించిన భవనం అవసరమైంది. దీంతో చిత్ర యూనిట్ ఓ సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు.అయితే అలాంటి సెట్ ఏం వద్దని నిజమైన రైతులు ఉండే ఊరులోనే చిత్రీకరణ జరుపుదామని విజయ్ సేతుపతి చెప్పారు. అలాగే అక్కడ రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి అందులో షూటింగ్ చేద్దామని చిత్రయునిట్ కు చెప్పారు. ఇక షూటింగ్ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే భవనాన్ని అప్పగించాలని కోరారట. ఈ నిర్ణయంపై చిత్ర యూనిట్ విజయ్ సేతుపతిని అభినందించింది. అలాగే గ్రామ ప్రజలు కూడా కూడా హర్షం వ్యక్తం చేశారు.విజయ్ సేతుపతి తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.

తాజా సమాచారం