బాధ్యులు విధులు నిర్వర్తించడం లేదు

బాధ్యులు విధులు నిర్వర్తించడం లేదు

బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల బాధ్యులు ఏ మాత్రం సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ విమర్శించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. పారీట అధ్యక్షురాలు సోనియా గాంధీ వెంటనే జోక్యం చేసుకొని జాతీయ కార్య వర్గ పని తీరును మెరుగు పరచాలని కోరారు. రాజస్థాన్ పరిణామాల్ని ప్రస్తావించి నపుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కే మద్దతుగా నిలిచారు. సచిన్ పైలెట్ మరికొన్ని రోజులు వేచి చూస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యువ నేతలనే ప్రోత్సహిస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టడం కాదు. ఈ కాలం యువ నేతల్లో ఏమాత్రం ఓపిక ఉండటం లేదు. సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి పదవికి పూర్తి అర్హుడు. అయితే మరికొన్ని రోజులు ఓపిక పట్టి ఉండాల్సింది. కేవలం 42 ఏళ్ల వయస్సులోనే పార్లమెంటు సభ్యులయ్యారు. కేంద్ర మంత్రిగా పని చేసారు. ఉపముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్ష పదవుల్ని నిర్వర్తించారు. స్థానిక నేతల నుంచి వస్తున్న సవాళ్లు, డిమాండ్లను అర్థం చేసుకోవడంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జీలు విఫలం చెందారు. వారు చురుగ్గా ఉన్నట్లయితే రాజస్థాన్ రగడ సంభవించేదే కాదు. చాలా సార్లు వారు స్థానిక ఇబ్బందులను అధిష్ఠానం దృష్టికి తీసుకురార’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos