ముల్లంగి ధరల పతనం

ముల్లంగి ధరల పతనం

హోసూరు : కృష్ణగిరి జిల్లాలో ముల్లంగి పంటకు గిరాకీ కరువవ్వడం తో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా రైతులు ముల్లంగి పంటను ఎక్కువగా సాగుచేశారు. లాక్ డౌన్ కారణంగా రవాణా పూర్తిగా స్తంభించడంతో పంటను కొనేందుకు వ్యాపారులు ఎవరూ రాకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కిలో ముల్లంగిని రెండు రూపాయలకు కూడా కొనేవారు లేకపోవడంతో కొందరు రైతులు పంటను కోయకుండా తోటల్లోనే వదిలివేశారు. పంటను కోసి మార్కెట్టుకు తరలించినా లాభం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన తమను ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos