ప్రపంచ వృద్దుడు ఇక లేరు

ప్రపంచ వృద్దుడు ఇక లేరు

టోక్యో:ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్కు చెందిన చిటెట్సు వటనాబె(112) ఆదివారం తుది శ్వాస విడిచారు.మంగళవారం అంత్య క్రియలు నిర్వహించినట్లు గిన్నీస్ రికార్డ్స్ ప్రతి నిధులు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల వల్ల ఆహా రాన్ని తీసుకోలేదు. ఆయనకు ఐదుగురు సంతానం.భార్య పేరు మిట్సు. 12 మంది మనవళ్లు, 17 మంది ముని మనవండ్లు ఉన్నారు. 1907లో ఉత్తర జపాన్లోని నీగటాలో జన్మించాడు. వ్యవసాయ విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. తైవాన్లోని దాయ్-నిప్పన్ మెయిజి షుగర్ కంపెనీలో గుత్తేదారు పనుల్లో చేరాడు. గత 18 ఏళ్లు అక్కడే నివసించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి తన స్వస్థలమైన నీగటకు చేరుకు న్నాడు.వయస్సు మీదపడ్డా తన పొలంలో పండ్లు, కూరగాయలు పండిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. ‘ఎప్పుడూ కోపగించు కోకండి.ముఖాలపై చిరునవ్వును చెరగనీయకండి’ అని విలువైన సలహా ఇచ్చాడు. ఇదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos