జెండా కొనకుంటే రేషన్ సరుకులు ఇవ్వం

జెండా కొనకుంటే రేషన్ సరుకులు ఇవ్వం

న్యూ ఢిల్లీ: ‘పేదలు తమ రేషన్ కార్డుల ద్వారా సరుకులు తీసుకోవడానికి వెళ్తే. కచ్చితంగా జెండాలు కొనాల్సిందేనని రూ. 20 వసూళ్లకు పాల్పడ్డారని’ బీజేపీ లోక్సభ సభ్యుడు వరుణ్ గాంధీ ధ్వజమెత్తారు. ‘75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పేదలపై మరింత భారం మోసేవిగా ఉంటే.. అది చాలా బాధాకరం. రేషన్ కార్డుదారులు జాతీయ జెండా కొనాలని బలవంత పెడుతున్నారు. లేదంటే సరుకుల్లో కొంత వాటా కోత పెడుతామని హెచ్చరించారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంటుంది. పేదల ముద్దను కూడా జాతీయ జెండాకు వెలగా లాక్కోవడం సిగ్గు చేటు. రేషన్ కొంటున్న వ్యక్తిని రూ. 20 చెల్లించి జాతీయ జెండా కొనాల్సిందేనని వ్యాపారి పట్టు బట్టిన వీడియోను హర్యానాలోని కర్నాల్కు చెందిన ఓ న్యూస్ పోర్టల్ విడుదల చేసింది. ‘రేషన్ కార్డు మీద ధాన్యాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ అదనంగా రూ. 20 పెట్టి జాతీయ జెండా కొని తమ ఇంటి వద్ద ప్రదర్శించుకోవాలని మాకు ఆదేశాలు వచ్చాయి. వాటిని పాటించడం తప్పా మేము ఏమి చేయగలం ’అని వీడియోలో వ్యాపారి పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కాగానే ఆ రేషన్ డిపో యజమాని లైసెన్స్ను పై అధికారులు రద్దు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా వెంటనే తమకు తెలపాలని డిప్యూటీ కమిషనర్ అనిశ్ యాదవ్ తెలిపారు. జెండా కొనుగోలు రేషన్ కార్డు దారుల ఇష్టమని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos