వరవరరావుకు బెయిలు

వరవరరావుకు బెయిలు

న్యూఢిల్లీ : విప్లవ రచయితల సంఘం నేత పి వరవరరావుకు న్యాయమూర్తులు లలిత్, రవీంద్ర భట్, సుధాంశు దులియా తో కూడిన అత్యున్నత న్యాయ స్థాన ధర్మాసనం బుధవారం రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును శాశ్వత బెయిలుగా మార్చిం ది. కేసు విచారణ జరుగుతున్న కోర్టు అధికార పరిధి నుంచి వెలుపలికి వెళ్ళరాదని షరతు విధించింది. స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదనీ హెచ్చరించింది. కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని కూడా సూచించింది. ఆయన వయసు 82 సంవత్సరాలు కావడం, అనారోగ్య కారణాల వల్ల బెయిలును మంజూరు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. చికిత్సకు సంబంధించిన వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తెలపాలని ఆదేశిం చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు దులియా తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిపి, ఆయన బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అవసరమైతే విచారణకు సహకరించాలని షరతు విధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos