వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

అమరావతి:వైఎస్సార్‌సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను జైలు నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవ‌డంలో ఆయ‌న‌కు ఇబ్బందిపడడంతో ఆయనను దవాఖానాకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో విజయవాడలోని ఎస్సీ-ఎస్టీ కోర్టూ గత మంగళవారం బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో నలుగురికి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కోర్టు బెయిల్‌ ఇచ్చినా ఆయన జైలు నుంచి విడుదలకాలేకపోయారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos