యూట్యూబ్లో ఈ ప్రకటనలు ఉండవు

యూట్యూబ్లో ఈ ప్రకటనలు ఉండవు

న్యూఢిల్లీ: యూట్యూబ్ ఇకపై జూదం, మద్యం, రాజకీయాల వాణిజ్య ప్రకటనల్ని ప్రసారం చేయరాదని నిర్ణయించింది. ‘వినియోగదార్ల పట్ల ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాలని అనుకుంటున్నాం” అని యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా వినియోగదార్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు, అసత్య ప్రచారాలకూ చోటు ఉండబోదని స్పష్టం చేసింది. థంబ్నెయిల్స్ విషయంలోనూ కఠినంగా వ్యవహరిం చనుంది. ‘అవి మానసికంగా వినియోగదార్లను ప్రభావితం చేస్తాయి. అలాంటి యాడ్లను ప్రోత్సహించం’ అని యూట్యూబ్ ప్రతినిథి ఒకరు వెల్లడించారు. వినియోగదార్లకు పనికొచ్చే, అవగాహన కలిగించే వాణిజ్య ప్రకటనలే ఉంటాయని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos