ట్రంప్​ వీసా నియమాల తిరస్కరణ

ట్రంప్​  వీసా నియమాల తిరస్కరణ

వాషి్ంగ్టన్: డోనాల్డ్ ట్రంప్ హయాంలో మార్చిన హెచ్1బీ వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్ట్ కొట్టేసింది. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు పని చేసే విదేశీ ఉద్యోగులను నియమించకుండా నిరుడు కొత్త నిబంధనలు అమలు చేసారు. లాటరీ పద్ధతిలో ఎక్కువ వేతనాలుండే ఉద్యోగాలకు అమెరికన్లను తీసుకొనేలా నియమాల్ని మార్చారు. దీని వల్ల ప్రతిభ కలిగిన విదేశీయులు, విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టంగా మారుతుందని సంస్థలు ఆక్షేపించాయి. అది వలస, స్థానికత చట్టానికి వ్యతిరేకమని చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు పిటిషనర్లు వాదించారు. నిరుడు డిసెంబర్ లో అమెరికా జిల్లా కోర్టు ఆ నిబంధనలను తాత్కాలికంగా నిలిపేసింది. ఆ నిబంధనలు చెల్లబోవంటూ ఫెడరల్ కోర్ట్ స్పష్టం చేసింది. ఆ నిబంధనలను ఇచ్చినప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీకి ఇన్ చార్జి మంత్రిని అక్రమంగా నియమించారని, కాబట్టి ఆ రూల్స్ చెల్లవని తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos