ద్రవోల్భణంపై చర్చకు విముఖత

ద్రవోల్భణంపై చర్చకు విముఖత

న్యూ ఢిల్లీ: రాజ్యసభలో ద్రవోల్భణంపై చర్చకు డిప్యూటీ ఛైర్మన్ నిరాకరించినందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎన్సీపీ, ఆర్జేడీ, టీఆర్ఎస్, ఐయూఎంఎల్ నేతలు కూడా నిరసనగా కాంగ్రెస్ బాట పట్టారు. విపక్షాల నిరసన మధ్య రాజ్యసభదాదాపు గంట పాటు వాయిదా పడిన రాజ్యసభ.. 12గంటలకు తిరిగి ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు అవకాశం లేదని డిప్యూటీ స్పీకర్ తేల్చిచెప్పారు. ఫలితంగా విపక్ష నేతలు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. రాజ్యసభలో నాలుగో రోజూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ మొదలైన కొద్ది సేపటికే 12గంటల వరకు వాయిదా పడింది. 12మంది ఎంపీల సస్పెన్షన్పై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. నల్ల పట్టీలు ధరించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. భాజపా ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశమై గురువారం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos