ఉద్యోగుల అపోహలను తొలగించాం…

ఉద్యోగుల అపోహలను తొలగించాం…

అమరావతి: పీఆర్సీ అంశానికి సంబంధించి మంత్రుల కమిటీతో జరిగిన ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది. మంగళవారం సంప్రదింపుల కమిటీ వద్దకు ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ సభ్యులు వచ్చారు. దీనిలో భాగంగా ప్రభుత్వ నిర్ణయాలు, ప్రయోజనాలను మంత్రుల కమిటీ వివరించింది. జీతాలు తగ్గాయన్న అపోహలను మంత్రుల కమిటీ తొలగించే యత్నం చేసింది.
ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల అపోహలు తొలగించే ప్రయత్నం చేశామన్నారు. ‘ 27వ తేదీన మరొకసారి చర్చలకు పిలిచాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే. జీవోలను అబియన్స్‌లో పెట్టాలని వారు కోరారు. అవి తర్వాతైనా సవరించుకోవచ్చని చెప్పాం. మేం చెప్పిన విషయాలను వాళ్ల నాయకత్వంతో చర్చించి చెప్తామన్నారు. ఫిట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి మార్పు ఉండదు. ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. సీఎం జగన్ ఎప్పుడూ ఉద్యోగులకు మేలు చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు ఉద్యోగులు అడగకుండానే అన్నీ చేశాం’ అని సజ్జల తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos