ఉక్రెయిన్ విమానం కూలి, పేలి 170 మంది మృతి

ఉక్రెయిన్ విమానం కూలి, పేలి 170 మంది మృతి

టెహ్రాన్: ఇక్కడకు సమీపంలో బుధవారం తెల్లవారి ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం కుప్ప కూలటంతో దానిలోని మొత్తం 170 మంది ప్రయాణికులు అక్కడి కక్కడే కన్నుమూసారు. సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని అధికార్లు తెలిపారు. ఇక్కడి ఇమామ్ ఖోమైనీ విమానాశ్రయం నుంచి తెల్లవారు జామును 6.12 గంటలకు ఎగిరిన విమానం కేవలం ఎనిమిది నిమిషాల తర్వాత నేలకూలింది. సంబంధిత వీడియో ప్రమాదాన్ని కళ్లకు కట్టింది. ఒక బంతిలా మండుతూ విమానం నేలను ఢీకొని పెద్ద శబ్దంతో పేలిపోయింది. మంటలు ఎక్కువగా ఉండటంతో… ఎవరినీ కాపాడలేకపోయామని ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చీఫ్ తెలిపారు. ప్రమాదస్థలిలో 22 అంబులెన్సులు, 4 బస్ అంబు లె న్సులు, ఒక హెలికాప్టర్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos