ఉద్ధవ్‌పై విశ్వాసం

ఉద్ధవ్‌పై విశ్వాసం

ముంబై : ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని ‘మహా వికాస్‌ అఘాడి’ సర్కారు మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంది. ఉద్ధవ్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని 169 మంది సభ్యులు బలపరచగా, ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. బీజేపీ సహా మొత్తం 109 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ నుంచి 105 మంది సభ్యులు వాకౌట్ చేయగా, ఇతరులు నలుగురు సభకు గైర్హాజయ్యారు. అసెంబ్లీ సమావేశాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభమైనందున బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. బల నిరూపణ చెల్లదని అనంతరం మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. సభా నిబంధనలు పాటించకుండా జరిగిన ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.

తాజా సమాచారం