రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

హొసూరు : శూలగిరి- క్రిష్ణగిరి  జాతీయ రహదారి చిన్నారి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బెంగళూరు చెందిన తిరుమూర్తి (37), అతని స్నేహితుడు కలసి క్రిష్ణగిరి వైపు నుంచి హొసూరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ, రోడ్డు పక్కన నిలిపి  ఉన్న కంటైనర్ లారీని ఢీకొన్నారు. సంఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. రోడ్డు పక్కన రెండు శవాలు కనిపించడంతో స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాలను స్వాధీనపరచుకొని హొసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమూర్తి, అతని మిత్రుడు బెంగళూరుకు వెళుతుండగా, వారి వాహనం అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరి మరణం స్థానికులను కలచివేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos