ట్విన్ టవర్స్ రేపు కూల్చివేత

ట్విన్ టవర్స్ రేపు కూల్చివేత

న్యూ ఢిల్లీ : నగరానికి సమీపంలోని 30 అంతస్తుల్లో 320 అడుగుల ఎత్తు (97 మీటర్లు)లో నిర్మించినరెండు ఆకాశహర్మ్యాలు – అపెక్స్, సియానే లు ఆదివారం మధ్యా హ్నం పన్నెండు సెకనుల వ్యవధిలో నేల మట్టం కానుంది. విరుద్ధంగా వాటిని కట్టటమే దీనికి కారణం. ఇవి ఉన్నచోటే నేలమట్టం అయ్యేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. అత్యంత నైపుణ్యంతో మూడు దేశాల ఇంజినీర్లు వీటిని కూల్చనున్నారు. చుట్టు పక్కల భవనాల్లో జీవించే ప్రజలు, పెంపుడు జంతువు లు ఆదివారం ఉదయమే ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కూల్చివేత వల్ల నేలపై నుంచి 984 అడుగుల ఎత్తులో భారీ ధూళి మేఘం ఏర్పడొచ్చని అంచనా. దీని పై విమానాలు, విమానా శ్రయాలు, వైమానిక దళాలను అప్రమత్తం చేసారు. కూల్చివేత వల్ల వచ్చే ప్రకంపనలతో చుట్టుపక్కల ఉండే తమ ఇళ్లు దెబ్బతినే ముప్పుందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేసారు. ఎలాంటి ఆందోళనా అవసరంలేదని ఇంజినీర్లు చెప్పారు. నోయిడాలోని చాలా భవనాలను భూకంపాలను తట్టుకునేలా నిర్మించా రు. ఈ జంట భవనాలను కూల్చేటప్పుడు వచ్చే ప్రకంపనలు రెక్టర్ స్కేలుపై నాలుగు తీవ్రతతో వచ్చే ప్రకంపనల్లో పదో శాతం మాత్రమే ఉంటాయని వివరించారు. మొదట 18 అంతస్తులను పేలుడు పదార్థాలతో ధ్వంసం చేస్తాం. దీంతో మిగతావి వాటంతట అవే కూలిపోతాయి. ఇందుకు గురుత్వాకర్షణ శక్తి కూడా సాయం చేస్తుంది’’అని ఇంజి నీర్ ఉత్కర్ష్ మెహతా చెప్పారు. దాదాపు 30,000 టన్నుల శిథిలాలు పోగవుతాయని అంచనా. వీటిని 1,200 లారీల్లో దగ్గర్లోని ఒక రీసైక్లింగ్ ప్లాంట్కు తరలిస్తారు. రీసైక్లింగ్ కు మూడు నెలల సమయం పడుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos