రాహుల్ వ్యాఖ్యతో దారికి వచ్చిన శివసేన

రాహుల్ వ్యాఖ్యతో దారికి వచ్చిన శివసేన

ముంబై: పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదాను సోమవారం లోక్సభలో సమర్థించిన శివసేన రాజ్యసభ వ్యతిరేకించనుంది. ‘పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదాపై సోమవారం లోక్సభలో మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు. అన్ని విషయాలపై స్పష్టత వచ్చే వరకూ దీనికి మేం మద్దతివ్వం. విపక్షాల సూచనలకు అనుగుణంగా ముసాయిదాలో మార్పులు చేయాల్సిందే’ అని శివసేనాధిపతి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. లోక్సభలో మాదిరి రాజ్యసభలో ముసాయిదాకు అనుకూలంగా ఓటు వేయబోమని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టీకరించారు. లోక్సభలో ముసాయిదాను శివసేన సమర్థిం చినందుకు మిత్ర పక్షమైన కాంగ్రెస్ పరోక్షంగా విమర్శించింది. పౌర సత్వ చట్ట సవరణ ముసాయిదాకు మద్దతివ్వడం అంటే దేశ పునాదిని నాశనానికి ప్రయత్నించినట్లే అని రాహుల్ ట్విటర్ వేదికగా ధ్వజ మె త్తా రు. ఆ కాసేపటికి శివసేన తమ వైఖరి మార్చుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos