ప్రేమే ఒక మతం

ప్రేమే ఒక మతం

న్యూ ఢిల్లీ: ప్రేమనే తప్ప ధ్వేషాన్ని వ్యాపింపచేయరాదని కాంగ్రెస్ పార్టీ నేత కేటీఎస్ తుల్సి అన్నారు. పాలకులు ప్రతిపాదించిన లవ్ జిహాద్ చట్టం పై ఆయన విరుచుకు పడ్డారు.సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రేమికుల్ని కూడా వదలడం లేదు. ప్రేమికుల్ని హత్య చేయొచ్చు కానీ ప్రేమను ఎప్పటికీ చంపలేము. కొందరు ప్రేమలో మతాన్ని చూస్తున్నారు. కానీ, ప్రేమే ఒక మతం. ఎవరు ప్రేమించు కుంటు న్నారనేది ఆలోచించాల్సిన విషయమే కాదు. ఎందుకంటే, ప్రేమలో ఉన్నవారు సముద్రం కంటే విశాలమైన ఆలోచనలతో హృదయాలతో ఉంటారు. మీకు చాతనైతే ప్రేమికుల్ని చంపొచ్చు. కానీ, ప్రేమను ఎప్పటికీ ధ్వంసం చేయలేరు. కనీసం ఆపనైనా లేరు. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమలు కనిపిస్తుంటాయి. వారిలో మనకెక్కడా మత కోణం కనిపించదు. హీర్-రంజా, సోహ్నీ-మహిల్వాల్, సస్సుయి-పున్హున్ ఇంకా ఎన్నో ప్రేమ కథలు ఇలాంటివే. మనం వ్యాపింపజేయాల్సి ప్రేమను, ధ్వేషాన్ని, భయాన్ని కాద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos