దసరా ముంగిట ప్రయాణికులకు శుభవార్త

దసరా ముంగిట ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాదు: వచ్చే అక్టోబరు 23న విజయదశమిని పురస్కరించుకుని ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ఏకంగా 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. అక్టోబరు 15 నుంచి 29 తేదీల మధ్య రానుపోను ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 రాయితీ వర్తింపజేస్తామని వివరించింది. ఆ తేదీల్లో ప్రయాణాలకు ఈ నెల 30 లోపు టికెట్లు బుక్ చేసుకున్నవారికే రాయితీ వర్తిస్తుంది. రిజర్వేషన్ సదుపాయం కలిగిన అన్ని రకాల బస్సుల్లో ఈ రాయితీ అమలు చేస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos