కొత్త ఏడాదికి స్వాగతం పలకాలంటే చింగార వెళ్లాలంతే..

  • In Tourism
  • December 21, 2019
  • 250 Views
కొత్త ఏడాదికి స్వాగతం పలకాలంటే చింగార వెళ్లాలంతే..

రోజువారి ఒత్తిళ్లు,ట్రాఫిక్‌ ఇక్కట్లు,ఉద్యోగాలు,వ్యాపారాల పాట్ల నుంచి రెండుమూడు రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా పక్షుల కిలకిలలు, జలపాతాల గలగల సవ్వడులు వింటూ ప్రశాంతంగా గడపాలంటే పశ్చిమ కనుమల్లోని చింగార జలపాతాలకు వెళ్లాల్సిందే.ఎత్తైన కొండలు లోతైన లోయలు వాటిపై ఎటు చూసినా కాఫీ తోటలు ఇతర సుగంధ ద్రవ్యాల పరిమళాలతో చింగార జలపాతం మనసు దోచుకుంటుంది.అందుకే చింగార జలపాతాన్ని హనీ వ్యాలీ జలపాతం అనికూడా పిలుస్తుంటారు. ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని చింగార జలపాతం వద్ద కాలం గడపం అంటే  పచ్చనైన స్వర్గంలో విహరించడమే.అంతేకాదండోయ్‌ పొగమంచులో కుటంబంతో లేదా స్నేహితులతో కొత్త ఏడాదికి స్వాగతం పలకాలంటే చింగార జలపాతం వెళ్లాలంతే.

చింగార జలపాతం..

చింగార జలపాతం..

అందులోకి అడుగుపెట్టాలంటే ముందుగా హనీవ్యాలీ నుంచి నడక మొదలుపెట్టాలి.దట్టమైన అడవుల్లో అవరోహణ,అధిరోహణ క్రమంలో కొండలు,లోయల్లో ఐదు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్‌ చేసి చింగార జలపాతం చేరుకోవాలి.ఒక్కసారి జలపాతానికి చేరుకున్నాక పాల జలపాతాన్ని తలపించేలా అంత ఎత్తు నుంచి కిందకు దూకే చింగార లేదా హనీవ్యాలీ జలపాతాన్ని చూడగానే ట్రెక్కింగ్‌లో పడ్డ కష్టమంతా ఇట్టే ఎగిరిపోతుంది.తేటతెల్లనైన చల్లటి నీటిలో జలకాలడుతుంటే అంతకు మించి జీవితం లేదేమో అనిపిస్తుంది.

చింగార జలపాతం..

చింగార జలపాతం..

ట్రెక్కింగ్‌ పొడవుగా కాఫీతో పాటు మిరియాలు,ఏలకులు తదితర సుగంధ ద్రవ్యాలు ట్రెక్కింగ్‌ను మరింత మధురంగా మార్చేస్తాయి.అప్పుడప్పుడు కనిపించే సూర్యకిరణాలు,ఎత్తైన చెట్లపై రకరకాల పక్షులు చూస్తే సుగంధ ద్రవ్యాల పరిమళాల మధ్య ప్రయాణం ఏమాత్రం అలసట కలిగనివ్వదు. మార్గంమధ్యలో అక్కడక్కడా కనిపించే చిన్నచిన్న నీటి ప్రవాహాలు సేద తీర్చుకొమ్మని పిలుస్తుంటాయి.చింగారతో పాటు కన్నె అడవిలోని మరిన్ని సెలయేళ్ల ప్రవాహాలు,జలపాతాలు,వన్యప్రాణాలు మనసులను మరో లోకానికి తీసుకెళతాయి.ట్రెక్కింగ్‌తో పాటు మౌంటేన్‌ బైకింగ్‌,రకరకాల పక్షులకు కూడా చింగార అటవీప్రాంతం కేంద్రంగా విరాజిల్లుతోంది.

దట్టమైన అటవిలో సెలయేరు..

ఇక్కడి అటవీప్రాంతంలో కనిపించే మలబార్‌ ట్రోగన్‌,నీలగిరి లాఫింగ్‌ థ్రష్‌,గ్రేట్‌బ్లాక్‌ వుడ్‌పెక్కర్‌,కీస్టోన్‌ తదితర 300 జాతుల అరుదైన పక్షులను చూడవచ్చు.ఇక చింగార జలపాతానికి కూతవేటు దూరంలో ఉన్న ల్యాంప్‌ హౌస్‌ తదితర రెసార్టులు బస చేయడానికి మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. శీతాకాలంలో పొగమంచు మధ్య జలపాతం,అడవుల అందాలు తిలకించడం ఏదో తెలియని తన్మయత్వం కలిగిస్కతుంది.కొత్త సంవత్సరం సందర్భంగా పచ్చనైన అడవుల్లో కుటుంబం,స్నేహితులతో కలసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలంటే చింగార జలపాతం సరైన ఎంపిక.ట్రెక్కింగ్‌ సమయంలో జలగలు బెడద నుంచి తప్పించుకోవడానికి షూలు ధరించడంతో పాటు వెంట డెటాల్‌ లేదా ఉప్పు తీసుకెళ్లడం ఉత్తమం..

చింగార చుట్టూ రెసార్టులు..

చింగార చుట్టూ రెసార్టులు..

ఎలా చేరుకోవాలి?
బెంగళూరు నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థ బస్సుల్లో నేరుగా కొడగు జిల్లా విరాజ్‌పేటకు చేరుకోవాలి.అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో హనీవ్యాలీకి చేరుకొని నడక ద్వారా చింగార జలపాతం చేరుకోవచ్చు.రైలు మార్గంలో చేరుకోవాలంటే మైసూరు లేదా కన్నూరు లేదా సకిలేశ్‌పుర చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల్లో విరాజ్‌పేట చేరుకోవాల్సి ఉంటుంది.అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో హనీవ్యాలీకి చేరుకొని నడక ద్వారా చింగార జలపాతం చేరుకోవచ్చు.

చింగార చుట్టూ రెసార్టులు..

చింగార చుట్టూ రెసార్టులు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos