రైలు ఎక్క‌డానికి ప్లాట్ ఫామ్ టికెట్ చాలు

రైలు ఎక్క‌డానికి ప్లాట్ ఫామ్   టికెట్  చాలు

న్యూ ఢిల్లీ: రైలు ప్రయాణికులు టికెట్ తీసుకోకుండా ప్రయాణించేందుకు రైల్వే శాఖ అనుమతించింది. రైలు ఎక్కడానికి కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ చాలు. రైలు ఎక్కిన తర్వాత ఆ టికెట్ ను టీటీఈకి చూపించి గమ్యస్థానానికి టికెట్ తీసుకోవచ్చని రైల్వే అధికార్లు వివరించారు. టికెట్ కోసం ప్రయాణికులు వరుసల్లో నిలబడే కష్టాలు ఉండవు. ప్లాట్ ఫామ్ టికెట్ ను యూటీసీ యాప్ ద్వారా లేక రైల్వే స్టేషన్లలోని వెండింగ్ మిషన్ల ద్వారా తీసుకోవచ్చు. దీంతో రైలు వచ్చే సమయం దగ్గరపడుతోందని, రైలు వెళ్లిపోతోందని, రైల్వే స్టేషన్కు ఆలస్యంగా వచ్చామని ప్రయాణికులు కంగారు పడే అవసరం లేదు. ఒకవేళ ప్రయాణికులు ఎక్కిన రైళ్లలో సీట్లు లేకున్నా, బెర్త్ దొరకనప్పటికీ రైలు ప్రయాణం చేయొచ్చు. అవసరమైతే రిజర్వేషన్ సైతం చేయించు కోవచ్చు. టికెట్ లేకుండా రైలు ఎక్కితే విధించే జరిమానాలు రైల్వే ప్రయాణికులు చెల్లించే అవసరం ఉండదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos