బంగ్లా రైలు ప్రమాదంలో 15 మంది మృతి

బంగ్లా రైలు ప్రమాదంలో 15 మంది మృతి

ఢాకా: బంగ్లా దేశ్లో రెండు రైళ్లు ఢీకొని 15 మంది మృతి చెందారు. అరవై కంటే ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడ్డారు. కస్బా ప్రాంతంలోని మండోల్బాగ్ స్టేషన్ వద్ద మంగళ వారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఢాకా వైపు వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎదురుగా చిట్టగాంగ్ వైపు వస్తున్న మరో రైలును వేగంగా ఢీకొట్టింది. దీంతో చిట్టగాంగ్ వెళ్తున్న రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్లు,ముందు బోగీలు చాలా వరకు ధ్వంస మయ్యాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నందున చాలా మంది రైలు పెట్టెల్లోనే ఇరుక్కు పోయారు. వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నా యి. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు పోలీసులు తెలిపారు. సిగ్నల్స్ తప్పిదం వల్లే రెండు రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos