మూగబోయిన ప్రజా గళం

మూగబోయిన ప్రజా గళం

హైదరాబాదు : ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజా వాగ్గేయకారుడు, ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ నేత మహ్మద్ నిస్సార్ బుధవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధ సమస్యతో ఇక్కడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిస్సార్ తొలుత ఎన్నో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా చేర్చుకో లేదు. చివరికి గాంధీలో చేరితే వెంటిలేటర్ లేక చనిపోయినట్లు ఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో పుట్టిన మహమ్మద్ నిస్సార్ తొలుత లారీ డ్రైవర్గా, ఆ తర్వాత ఆర్టిసి కండక్టర్గా విధులు నిర్వర్తించారు. చిన్నతనం నుంచే అనేక ప్రజా ఉద్యమాలపైనా, అనేక వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన పాటలు రచించారు. ఎన్నో సభలకు నాయకత్వం వహించారు. కరోనా పైనా పాటలు రాశారు. 20 రోజుల కిందట స్వగ్రామం సుద్దాలపై , గీత కార్మికుల కష్టాలపైన ఓ లఘు చిత్రాన్ని తీసారు. నిస్సార్ మరణంతో సుద్దాల గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos