మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వం

మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వం

న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతుల మరణాలకు సంబంధించిన దాఖలాలు రికార్డు లేనందున మృతులకు నష్ట పరిహారాన్ని చెల్లించే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం లోక్సభలో లిఖిత పూర్వకంగా ప్రకటించారు. 2020 నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ నిర్వహించిన ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వ్యవసా యోత్పత్తులకు కనీస మద్దతు ధర శాసనం చేయాలని, నిరసనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తు రైతు సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos