తిరుమల : తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం రెండవ ఘాట్రోడ్డులో చివరిమలుపు వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు కింద మృతదేహాలు ఇరుక్కుపోయాయి. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో మృత దేహాలను బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు. మృతుల్ని తమిళనాడు దంపతులుగా గుర్తించారు.