మతిమరుపునకు చిట్కాలు..

మతిమరుపునకు చిట్కాలు..

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా? ఏదైనా పని చేయాలనుకుని మర్చిపోతున్నారా? లేదా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన వస్తువులు మర్చిపోతున్నారా? ఇలాంటి మతిమరుపునకు కెనడాలోని రాట్ మన్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు పరిష్కారం సూచిస్తున్నారు. చిన్న చిట్కాతో దీనిని పరిష్కరించవచ్చని వారు చెబుతున్నారు. రెండు వస్తువులను అనుసంధానించడం ద్వారా మతిమరుపుకు చెక్ చెప్పవచ్చని సూచిస్తున్నారు.ఉదాహరణకు బైకు తాళాలు,మొబైల్‌ ఇంట్లోనే మరచిపోతుంటే ఈ రెండింటిని శిరస్త్రాణంలో పెడితే మరచిపోయే అవకాశమే ఉండదు.అలాగే వస్తువును తీసుకెళ్లాలనుకున్నా దానిని మరో వస్తువుతో అనుసంధానం చేయాలని వారు సూచిస్తున్నారు. దాని వల్ల మతిమరుపును అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos