బెంగళూరు వెళుతున్నారా ఐతే ఫుడ్ స్ట్రీట్ వెళ్లడం మరచిపోకండి..

  • In Tourism
  • October 31, 2019
  • 245 Views
బెంగళూరు వెళుతున్నారా ఐతే ఫుడ్ స్ట్రీట్ వెళ్లడం మరచిపోకండి..

సిలికాన్ సిటీ,ఉద్యాన నగరిగా ప్రపంచ ఖ్యాతి గడించిన బెంగళూరు నగరం కేవలం ఉద్యోగాలు,ట్రాఫిక్ ఇక్కట్లకే కాదు నోరూరించే పలు రకాల వంటకాలకు కూడా పెట్టిందిపేరు.బెంగళూరు నగరానికి ఐకానిక్‌గా నిలుస్తున్న తిండి వీధి(ఫుడ్ స్ట్రీట్) గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద జాబితానే ఉంది.అదేంటి ఒక్కసారి చూద్దామా! బెంగళూరు నగరంలోని వి.వి పురంలో ఉన్న ఫుడ్ స్ట్రీట్లో సాయంత్రం ఆరు గంటల సమయం దాటగానే సందడి మొదలవుతుంది.
చీకటి పడగానే వీధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తెరుచుకునే హోటళ్లు,తోపుడు బండ్లు అర్ధరాత్రి వరకు కిటకిటలాడుతుంటాయి.నగరం నలు మూలల నుంచి వచ్చే ప్రజలతో పాటు బెంగళూరు ఇతర ప్రాంతాల పర్యటనకు వచ్చే విదేశీయులు,ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఈ ఫుడ్ స్ట్రీట్లో వాలిపోయి అన్ని రకాల వంటకాలను రుచి చూడడానికి ఆసక్తి కనబరుస్తారు.

ప్రజలతో కిక్కిరిసిన ఫుడ్ స్ట్రీట్..


పంచతార నక్షత్రాల హోటళ్లల్లో రుచికి,నాణ్యతకు ఏమాత్రం తగ్గకుండా అతితక్కువ ధరల్లోనే అన్ని రకాల వంటకాల ఇక్కడ లభించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సాయంత్రం కాగానే తిండి వీధిలో రెక్కలు కట్టుకొని వాలిపోతారు.

ఎన్ని వంటకాలో..


హనీ కేకులు,క్రీమ్ పఫ్స్,పెరుగు వడ,అక్కిరోటీ(బియ్యం రొట్టె),పడ్డు(చిన్న ఇడ్లీలు),అవరేకలు,డాబెలి,టాంగీ చాట్స్,రసగుల్లా చాట్,భక్షాలు,రోజ్మిల్క్,లస్సీ,రాబ్రి అబ్బో ఒకటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది రకరకాల ఆహార పదార్థాలు నోరూరిస్తుంటాయి.వీటితో పాటు గోబీ మంచూరి,బజ్జీలు,స్యాండ్ విచ్ కూడా చాలా రుచిగా ఉంటాయి.

సిద్ధమవుతున్న మాంసం వంటకాలు


రకరకాల చాట్స్‌..


ఇక మాంసం,చేపలు,బిరియాని ఇవన్నీ రుచి చూడాలే కానీ వాటి రుచి గురించి మాటల్లో చెప్పడం కష్టసాధ్యం.దశాబ్దాలుగా ఇక్కడే ఇదే వ్యాపారం చేస్తున్న అనేక హోటళ్లు,తోపుడు బండ్లపై లభించే మసాల దోశ,వెన్న దోశ,ఇడ్లీలకు నగరం నలుమూలల పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.చివరగా, వెన్న, గుల్కండ్, ఆమ్లా, ఐస్ క్రీం మరియు తాజా పండ్లతో తయారైన గుల్కన్‌ ఆస్వాదించడానికి శివన్న గుల్కున్ స్టాల్‌కు నడవడం ద్వారా మీ నడకను తీపి నోట్‌లో ముగించండి, పైన చెర్రీతో వడ్డిస్తారు.

చూస్తుంటేనే నోరూరుతోంది..


చూస్తుంటేనే నోరూరుతోంది..


వారంతాల్లో విపరీతమైన రద్దీతో కిక్కిరిసిపోవడంతో తిండి వీధి మిగిలిన రోజుల్లో సాధారణ రోజుల్లో వెళ్లడం ఉత్తమం.వి.వి.పురం లోని పాత మార్కెట్ రహదారిపై సజ్జన్ రావు సర్కిల్, మినర్వా సర్కిల్, ఆర్‌వి రోడ్,నేషనల్ కాలేజ్ ఫ్లైఓవర్ మధ్యలో ఫుడ్‌ స్ట్రీట్‌ ఉంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos