పృథ్వీ ఆడియో టేపు ఘటనలో ట్విస్ట్‌..

పృథ్వీ ఆడియో టేపు ఘటనలో ట్విస్ట్‌..

ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్‌కు దగ్గరైన హాస్యనటుడు పృథ్వీ పాదయాత్ర సమయంలో జగన్‌తో ఏర్పడ్డ పరిచయంతో వైసీపీ అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఎస్‌వీబీసీ ఛానల్‌ చైర్మన్‌ స్థానం దక్కించుకున్నాడు.అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఓ మహిళ ఉద్యోగితో పృథ్వీ అసభ్యంగా మాట్లాడాడంటూ బయటకు వచ్చిన ఆడియో టేపులు చర్చనీయాంశమయ్యాయి. పృథ్వీ ఆడియోటేపుల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఛానెల్‌ చైర్మన్‌ స్థానానికి పృథ్వీ రాజీనామా చేశారు.అయితే పృథ్వీపై ఆరోపణలు చేసిన బాధితురాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి విముఖత చూపడంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ ముందుకు సాగడంలేదని తెలుస్తోంది.తనతో పృథ్వీ ఫోన్లో మాట్లాడాడని చెబుతోన్న మహిళ.. తాను ఇప్పటికే అల్లరిపాలై కష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఆమె మీడియా ముందుకు రావడానికి సైతం ఇష్టపడటంలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు తమ వద్ద నున్న టెలీఫోన్ సంభాషణ టేపులతోనే విచారణ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.బాధితురాలు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం, నిందితుడిపై చర్యలు చేపట్టడం సాధ్యంకాదని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos