చారిత్రాత్మక డే నైట్ టెస్టుకు సర్వం సిద్ధం..

  • In Sports
  • November 22, 2019
  • 163 Views
చారిత్రాత్మక డే నైట్ టెస్టుకు సర్వం సిద్ధం..

అంతర్జాతీయ క్రికెట్‌లో మరి కాసేపట్లో చారిత్రాత్మక ఘట్టానికి తెర లేవనుంది.భారత్బంగ్లాదేశ్ మధ్య  కాసేపట్లో డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. మ్యాచ్ చూసేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్ కతా చేరుకున్నారు.సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమె ఈడెన్ గార్డెన్స్ చేరుకున్నారు. మ్యాచ్ చూసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రానున్నారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మ్యాచ్ ప్రారంభానికి వచ్చే అవకాశం ఉంది. ఈడెన్గార్డెన్లో నేటి నుంచి నెల 26 వరకు మ్యాచ్జరగనుంది. కాసేపట్లో టాస్ వేయనున్నారు.పశ్చిమ బెంగాల్ క్రికెట్అసోసియేషన్‌ (క్యాబ్‌) ప్రధాని మోదీని కూడా మ్యాచ్ కు ఆహ్వానించింది. రాజకీయ ప్రముఖులతో పాటు  షూటర్అభినవ్బింద్రా, బాక్సర్మేరీకోమ్, షట్లర్పీవీ సింధు కూడా హాజరుకానున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు.ఈ పింక్ టెస్టును చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునేలా బీసీసీఐ అన్ని హంగులను సిద్ధం చేసింది. స్టేడియానికి పరిసరాల్లో ఉన్న రోడ్లను అందమైన గ్రాఫిటీలతో ముస్తాబు చేసింది. అక్కడి పరిసరాలన్నీ గులాబీ రంగులతో మెరిసిపోతున్నాయి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos