దిశా బిల్లుకు కేంద్రం అడ్డు..

దిశా బిల్లుకు కేంద్రం అడ్డు..

కామంతో కళ్ళు మూసుకుపోయి అత్యాచారాలు,హత్యాచారాలకు తెగబడుతున్న కామాంధులను కఠినంగా శిక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది.మహిళలకు బాలలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో దిశా చట్టం పేరుతో తీసుకువచ్చిన బిల్లును శాసనమండలి అసెంబ్లీల్లో ఆమోదం పొందిన ఆ బిల్లుకు చట్టం రూపంలో అమల్లోకి తేవటం కోసం రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపింది.కొత్త బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంతో సంతకం అయితేనే చట్టం అవుతుంది. అప్పుడే ఆ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తేగలదు. అయితే ఇంతకాలం బిల్లును తన దగ్గరే అట్టేపెట్టుకున్న కేంద్రం చివరకు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తు తిప్పిపంపింది. అత్యాచారం హత్యాచారానికి పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షలు పడేవిధంగా దిశచట్టంలో మార్పులు చేసింది ప్రభుత్వం. నేరం జరిగినప్పటి నుండి 7 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని 14 రోజుల్లోనే కోర్టులో విచారణ ముగిసేట్లుగా దిశచట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది.శిక్షపడిన మూడు మాసాల్లోగా నిందితులు పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది దివచట్టం. అయితే దిశబిల్లులోని కొన్ని అంశాలపై కేంద్రం తన అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ అభ్యంతరాలేమిటి అన్న విషయంలో క్లారిటి లేదు. అలాగే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చాలని సూచనలు కూడా చేసిందట. అంటే కేంద్రం చెప్పినట్లుగా సవరణలు కొన్ని అంశాలను చేర్చిన తర్వాత మళ్ళీ శాసనమండలి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలి. ఉభయసభల్లో ఆమోదం పొందిన తర్వాత బిల్లును మళ్ళీ కేంద్రం ఆమోదం కోసం పంపాల్సిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos