WWW: వరల్డ్ వైడ్ వర్డ్స్’

WWW: వరల్డ్ వైడ్ వర్డ్స్’

న్యూ ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తరచుగా కొత్త ఇంగ్లిష్ పదాలను పరిచయం చేస్తుంటారు. వీటి కోసమే ఆయన్ను ట్విట్టర్ లో ఫాలో అయ్యేవారున్నారు. ఆయ న్ను అనుసరించే అసోంకు చెందిన షాజహాన్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ కొత్తగా ప్రారంభించే బుక్ స్టోర్ కు మంచి పేరు సూచించాలంటూ శశిథరూర్ ను కోరాడు. ‘‘డియర్ శశి థరూర్ సర్, నా ఆప్త స్నేహితుడు ఎంఫిల్ పూర్తి అయిన తర్వాత మజూలీలో అంగడి తెరవాలని అనుకుంటున్నాడు. ఇందులో నెట్ కేఫ్, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ విక్రయాలు ఉంటాయి. తన అంగడి కోసం ఇంగ్లిష్ లో ఒక వినూత్నమైన పేరు సూచించాలని అడుగుతున్నాడు. పేరుకు సంబంధించి అన్వేషణలో సాయం చేయగలరని ప్రార్థన’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ‘‘WWW: వరల్డ్ వైడ్ వర్డ్స్’? అని పిలవడం ఎలా ఉంది? ఇది పుస్తకాలతోపాటు ఇంటర్నెట్ ను కూడా కవర్ చేస్తుంది. అని థరూర్ ట్వీట్ చేశారు. థరూర్ ఇచ్చిన సూచనను ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. వినూత్నమైన పేరును సూచించినందుకు షాజహాన్ కూడా ధన్యవాదాలు తెలిపాడు . అంగడికి అదే పేరు పెడతామని ప్రకటించాడు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos