ఇప్పటికైనా గొడవ ఆగుతుందా..

  • In Film
  • December 2, 2019
  • 76 Views
ఇప్పటికైనా గొడవ ఆగుతుందా..

వృత్తి పరంగా తమ మధ్య పోటీ ఉంటుందని వ్యక్తిగతంగా తామంతా స్నేహితుల్లా కలిసే ఉంటామని ఎన్టీఆర్. తమిళ స్టార్ హీరో విజయ్ నిరూపించారు.విజయ్‌ నటించినవిజిల్చిత్రం ఇటీవల వెండి తెరపైకి వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాను చూసిన ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి విజయ్‌ని అభినందించారు. విషయాన్ని ఎన్టీఆర్ ప్రతినిధి కోనేరు మహేశ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలుగులోవిజిల్చిత్రాన్ని విడుదల చేసింది మహేశే. తాజాగా చెన్నై వెళ్లిన మహేశ్, విజయ్ ని కలిసి, ఫొటోను పోస్ట్ చేశారు. సందర్భంగా ఎన్టీఆర్ ఫోన్ చేసిన విషయాన్ని విజయ్ వెల్లడించారట. తన సినిమాలపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి విజయ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని తన రాబోయే చిత్రాలు కూడా ప్రేక్షకులను రంజింపజేస్తాయన్న నమ్మకం ఉందని విజయ్ చెప్పారని మహేశ్ కోనేరు వ్యాఖ్యానించారు. రెండు పరిశ్రమల్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. డ్యాన్స్ చేయడంలో వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ విషయంలో ఈ వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడది చిలికి చిలికి గాలి వానలా మారింది.ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మహేశ్ కోనేరు చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. విజయ్ – జూనియర్ ఎన్టీఆర్‌లో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకున్నారనే వార్త బయటకు రావడంతో ఈ గొడవకు బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos