తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. ఈ నెల నాలుగో వారంలో నిర్వహించతలపెట్టిన శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి శని, ఆదివారాల్లో తన నివాసంలో ఆయన సమాలోచనలు తెలిపారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల కార్యక్రమం వెలువడవచ్చని సమాచారం. దీనిపై శ్రేణులను కూడా సిద్ధం చేయాలన్నది కేసీఆర్‌ సంకల్పం. కాగా ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, భువనగిరిలలో సిట్టింగులకు టికెట్లు ఖాయమైనట్లే. ఇతర చోట్ల పరిస్థితులను బట్టి అభ్యర్థులను మార్చే అవకాశాలున్నాయి. కొన్ని స్థానాల్లో బలమైన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలకు అవకాశం దక్కవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos