చిరంజీవిపై వైద్యశాఖ ఆగ్రహం..

  • In Film
  • November 17, 2020
  • 126 Views
చిరంజీవిపై వైద్యశాఖ ఆగ్రహం..

మెగాస్టార్ చిరంజీవి తీరుపై వైద్య, ఆరోగ్య శాఖ మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తేలిన వారందరూ కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన ఉంది. అయితే చిరంజీవి మూడు రోజులు క్వారంటైన్‌లో ఉండి ఆ తర్వాత నెగిటివ్ వచ్చిందటూ బయట తిరగడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. దీపావళి సందర్భంగా ఆయన గురువు, కళాతపస్వి కె విశ్వనాథ్‌ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన చిరంజీవి ఆయన్ని సత్కరించారు.ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చిరంజీవికి మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాలని, నెగిటివ్ వచ్చిందని ఇష్టారీతిన బయట తిరగకూడదని ఆ మెసేజ్‌లో వెల్లడించారట. సెలబ్రెటీ అయిన మీరే ఇలా చేస్తే సామాన్య ప్రజలు నిబంధనలు పాటిస్తారా? అని అధికారులు చిరంజీవిని సున్నితంగా నిలదీసినట్లు తెలుస్తోంది. దీనిపై చిరంజీవి నుంచి, వైద్యశాఖ అధికారులు నుంచి ఎటువంటి అధికారి ప్రకటన రాలేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos