వారి వ్యూహాలు అనుసరణీయాలు

వారి వ్యూహాలు అనుసరణీయాలు

జెనీవా : కరోనాపై పోరులో జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్లు అమలు చేసిన సమగ్రమైన, సమర్థవంతమైన వ్యూహాలు ఇతర దేశాలకూ ఆదర్శనీయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ‘కరోనా విశ్వరూపాన్ని ప్రపంచం ఇంకా చూడ లేదు. ఐదు లక్షల మంది ఈ వైరస్తో మరణించారు. వైరస్ ఇంకా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇంకా ముగిసి పోలేదు. ఈ వైరస్ అంతం కావాలని కోరుకుంటున్నాం. నమ్మశక్యం కాని అంశం ఏమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వైరస్వ్యాప్తిని అడ్డుకోవడంలో పురోగతి సాధించినా , మహమ్మారి ఇంకా వేగంగా విజృంభిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. వైరస్ వ్యాప్తి నివారణకు సురక్షితమైన, సమర్థ వంతమైన వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినా పూర్తిస్థాయిలో అందు బాటులోకి రాలేదు. పరీక్షలు నిర్వహించి రోగుల్ని గుర్తించి క్వారం టైన్ చేయడం, వారి సన్నిహతులను గుర్తించి కరోనాపై పోరు సాగిం చాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos