రెండో టెస్టులోనూ అదే సవాలు…

  • In Sports
  • February 26, 2020
  • 20 Views
రెండో టెస్టులోనూ అదే సవాలు…

క్రైస్ట్‌చర్చ్‌: రెండో టెస్టులోనూ టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవని న్యూజిలాండ్‌ పేసర్‌ నీల్‌వాగ్నర్‌ అంటున్నాడు. ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలించే హెగ్లే ఓవల్‌ మైదానంలో వేగం, బౌన్స్‌తో పర్యాటక జట్టుకు కష్టమేనని వెల్లడించాడు. తొలి టెస్టు వ్యూహమే ఇక్కడా అమలు చేస్తామని పరోక్షంగా హెచ్చరించాడు. సతీమణి ఆడబిడ్డ (ఒలీవియా)కు జన్మనివ్వడంతో తొలిటెస్టు నుంచి అతను తప్పుకున్నాడు.  భారత ఆటగాళ్లు కొత్త వాతావరణానికి అలవాటు పడటం కష్టం. కట్టుదిట్టమైన బంతులు, లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో నిరంతరం ఒత్తిడి చేస్తే మా పని సులువు అవుతుంది’అని వాగ్నర్‌ అంటున్నాడు. చిన్న టెస్టు సిరీసు కావడంతో కివీస్‌ పరిస్థితులు, వాతావరణానికి అలవాటు పడేందుకు కోహ్లీ సేనకు సమయం సరిపోవడం లేదని అన్నాడు. కొన్నిసార్లు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఒకటి లేదా రెండు మ్యాచుల సమయం పడుతుంది. ఐతే భారత్‌ బలంగా పుంజుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాకు అనువైన పరిస్థితుల్లో మేం కచ్చితంగా ప్రభావం చూపిస్తాం. అరంగేట్రం పేసర్‌ జేమీసన్‌ అదరగొట్టాడు. నా కూతురు ఇంకాస్త ముందే జన్మించివుంటే నేను జట్టుతోనే ఉండేవాడిని. ఐతే ప్రపంచంలో దేన్నీ మనం మార్చలేం కదా’అని వాగ్నర్‌ పేర్కొన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos