జైపూర్‌లో టీమిండియా ప్రాక్టీస్

  • In Sports
  • November 16, 2021
  • 24 Views
జైపూర్‌లో టీమిండియా ప్రాక్టీస్

టి20 ప్రపంచకప్ 2021 ముగిసిన వెంటనే టీమిండియా కివీస్‌తో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. టి20 ప్రపంచకప్పులో నిరాశపరిచిన టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్‌పై దృష్టి పెట్టింది. నవంబర్ 17 నుంచి టి20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా నవంబర్ 14న యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకొని జైపూర్‌లో అడుగుపెట్టింది. మూడు రోజుల క్వారంటైన్ అనంతరం టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.
రోహిత్ శర్మకు టి20ల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఇదే మొదటి టి20 సిరీస్ కానుంది. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ హిట్‌మ్యాన్‌కు బంతులు విసరడం.. అతను కొన్ని చక్కని షాట్లు ఆడడం వైరల్‌గా మారింది. కాగా రోహిత్ శర్మ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్పులో ఐదు మ్యాచుల్లో 174 పరుగులు చేసిన రోహిత్ రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కేఎల్ రాహుల్ తర్వాత టీమిండియా తరపున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos